Shamshera | ‘కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం’.. ‘షంషేరా’ తెలుగు పోస్టర్ విడుదల
Shamshera Telugu Poster | బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. అయినా కాని తెలుగు ప్రేక్షకులలో రణ్‌బీర్‌పై ఎనలేని అభిమానం ఉంది. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్లో అది రుజువైంది కూడా. రణ్‌బీర్ కూడా తెలుగు ప్రేక్షకులు తనను అంతగా ఆధరిస్తారని అనుకొలేదని స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సంజూ’ తరువాత రణ్‌బీర్ నాలుగేళ్ళకు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో బాలీవుడ్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే లీక్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
తాజాగా మేకర్స్ తెలుగు, తమిళ పోస్టర్లను విడుదల చేశారు. ‘కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం’ అంటూ షంషేరా థీమ్‌ను పోస్టర్లో వెల్లడించారు. ఈ పోస్టర్లో రణ్‌బీర్ చేతిలో గొడ్డలి పట్టుకుని గుబురు గడ్డంతో ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు. రణ్‌బీర్ ఈ సినిమాలో 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణీ కపూర్లు కీలకపాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదలకానుంది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘బ్రహ్మాస్త్రం’ కూడా ఇదే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం రణ్‌బీర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
Introducing Shamshera – the fierce warrior & the saviour of his tribe. Experience it in @IMAX in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. pic.twitter.com/QUzDQVckPv
— Yash Raj Films (@yrf) June 20, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

