భారతీయ పురాణేతిహాసం రామాయణం మరోమారు వెండితెరపై దృశ్యమానం కాబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారాముల పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రావణ పాత్రధారిగా యష్ కనిపించనున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే దీపావళికి తొలిభాగం ప్రేక్షకుల ముందుకురానుంది. ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ పేరుతో ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ అత్యద్భుత సాంకేతిక హంగులతో ఆకట్టుకుంది.
ఇదిలావుండగా ఈ సినిమా కోసం రణబీర్కపూర్కి భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుబోతున్నారని తెలిసింది. రెండు భాగాలకు కలిపి ఆయన 150కోట్ల వరకు రెమ్యునరేషన్ స్వీకరించనున్నారని బాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. ఇక సీత పాత్రధారి సాయిపల్లవి 15కోట్ల వరకు పారితోషికం తీసుకోనుందని సమాచారం. దాదాపు 1600కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రానికి సంబంధించిన రెండు భాగాలను తెరకెక్కించనున్నారు. యష్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.