శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 20:27:34

సంజ‌య్ ద‌త్‌ని ప‌రామ‌ర్శించిన రణ్‌బీర్, అలియా!

సంజ‌య్ ద‌త్‌ని ప‌రామ‌ర్శించిన రణ్‌బీర్, అలియా!

సంజయ్‌దత్‌ కుటుంబానికి క్యాన్సర్‌ ఒక శాపంలా మారింది. ఇప్ప‌టికే ఆయ‌న తల్లి, ఇద్దరు భార్యలు క్యాన్స‌ర్‌ బారిన పడ్డారు.  త‌ల్లి క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించ‌గా, ఓ భార్య జ‌యించింది. తాజాగా సంజయ్‌దత్‌కు క్యాన్సర్‌ స్టేజ్‌ 3 లెవల్‌లో ఉందని వైద్యులు చెబుతున్నారు. ఛాతీలో అసౌకర్యం వల్ల ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన సంజ‌య్‌కి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుప‌గా నెగెటివ్ అని తేలింది. కాని లంగ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ‌ అయింది.

సంజ‌య్‌కి క్యాన్స‌ర్ అన్న విష‌యం బ‌య‌ట‌కు రాగానే ఆయ‌న అభిమానులు, స‌న్నిహితులు, ప్ర‌ముఖులు సంజ‌య్ ఆరోగ్యం గురించి వాక‌బు చేయ‌డం మొద‌లు పెట్టారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. అయితే ఈ వారంలోనే సంజ‌య్ అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు ప‌య‌నం కానున్న నేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రితం ర‌ణ్‌భీర్ క‌పూర్, అలియా భ‌ట్‌లు సంజ‌య్ ఇంటికి వెళ్ళి ప‌రామ‌ర్శించారు. ఆయ‌న యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రణ్‌బీర్ క‌పూర్.. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్‌లో ప్ర‌ధాన పాత్ర న‌టించిన విష‌యం తెలిసిందే. షంశెరా అనే చిత్రంలోను ఇద్ద‌రు క‌లిసి న‌టిస్తున్నారు. ఇక అలియాభ‌ట్‌, సంజ‌య్ న‌టించిన స‌డ‌క్ 2 చిత్రం ఈ నెల‌లోనే ఓటీటీలో విడుద‌ల కానుంది.


logo