వివాహానంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. 19వ శతాబ్దంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్కి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానున్నది. తాజాగా ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు, అభిమానులు బైక్ ర్యాలీని నిర్వహించి, నూతనజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫ్యాన్మీట్లో రాయలసీమ అభిమానులను విజయ్ దేవరకొండ కలుసుకొని ఆనందంగా గడిపారు. రాయలసీమకు ఎప్పుడు వచ్చినా సొంతూరుకి వచ్చిన అనుభూతి కలుగుతుందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే యోధుడిగా నటిస్తుండగా, అతని భార్య జయమ్మగా రష్మిక మందన్న కనిపించనున్నది.