Rana | నాకొచ్చిన పెద్ద ప్రశంస ఆయనదే..చిట్‌చాట్‌లో రానా
భీమ్లానాయక్ (Bheemla Nayak) విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్ ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతూ..కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డానియల్ శేఖర్‌గా రానా పోషించిన పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు రానా.
టాలీవుడ్ స్టార్ యాక్టర్లు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా (Rana) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). ఈ మూవీ విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్ ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతూ..కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. త్రివిక్రమ్ (Trivikram) కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రంలో డానియల్ శేఖర్‌గా రానా పోషించిన పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు రానా.
భీమ్లానాయక్ ను మీరు అంతగా ప్రమోట్ చేయలేదెందుకని ప్రశ్నించగా..? నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు షూటింగ్లో బిజీగా ఉండటంతో భీమ్లా నాయక్ ప్రమోషన్స్ కు వెళ్లలేకపోయా. విడుదలైన తొలి రోజు కూడా నేను షూటింగ్‌లోనే ఉన్నా. సాయంత్రం కొంత టైం దొరకడంతో ముంబైలో తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశానన్నాడు.
ఈ సినిమాకు అందుకున్న ఉత్తమ ప్రశంస ఏంటని అడగ్గా..మా నాన్న నా సినిమాలకు అంతగా ప్రశంసలు అందించరు. కానీ భీమ్లానాయక్ లో నా నటన చూసి సంతోషపడ్డారు. నా యాక్టింగ్ చాలా బాగుందని, సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు నాకొచ్చిన పెద్ద ప్రశంస ఇదే. అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కల్యాణ్‌తో పనిచేయడంపై స్పందిస్తూ..అంతకుముందు పవన్ కల్యాణ్‌తో నేను అంతగా ఇంటరాక్ట్ అవ్వలేదు. షూటింగ్ సమయంలో పవన్‌ను చాలా దగ్గరగా చూసి..ఆయన గురించి తెలుసుకున్నా. పవన్ చాలా సైలెన్స్ గా ఉండే వ్యక్తి. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడడు. పవన్ కల్యాణ్ భావోద్వేగాలను చూపించే విధానం చాలా అద్బుతంగా ఉంటుంది. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నానని చెప్పాడు రానా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

