ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కమల్ హాసన్, అనుష్క శెట్టి, త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే కాగా, వారి ముగ్గురికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా తన సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. అయితే రానా పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన పలు సందర్భాలలో వీరిని కలవగా, వారితో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం రానా పోస్ట్ వైరల్గా మారింది. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ముగ్గురు ప్రముఖుల బర్త్ డే సందర్భంగా సర్ప్రైజెస్ వచ్చాయి. లోకనాయకుడు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా విక్రమ్ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ నిన్ననే విడుదల చేశారు.దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక అనుష్క బర్త్ డే సందర్భంగా నేడు ఆమె తదుపరి చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ సంస్థలో అనుష్క తన తదుపరి చిత్రం చేయనున్నట్టు తెలియజేశారు.
ఇక త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా భీమ్లా నాయక్ చిత్రం నుండి లాలా భీమ్లా అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది. కాగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే.
Happy birthdays to some seriously awesome people I’ve had the honour of meeting in life!! #Trivikram @MsAnushkaShetty @ikamalhaasan pic.twitter.com/X4tFRMiYWC
— Rana Daggubati (@RanaDaggubati) November 7, 2021