దగ్గుబాటి రానాని వివాహం చేసుకొని దగ్గుబాటి కోడలిగా అడుగుపెట్టింది మిహికా బజాజ్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మిహికా తన భర్తతో గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. కరోనా సమయంలో రానా మిహికాల వివాహం జరగగా, కేవలం సుమారు 30మంది బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి.
తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది మిహికా. తాజాగా పెళ్లితంతుకు సంబంధించిన వీడియోను రానా భార్య మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. మిహీకా వీడియోకు వెంకటేవ్ కూతురు ఆశ్రిత, మంచు లక్ష్మీ సహా మరికొందరు ప్రముఖులు కామెంట్స్ చేశారు. కాగా, వీరి పెళ్లికి ఉపయోగించిన వర్చువల్ వెడ్డింగ్ కార్డ్ అందరని ఆకట్టుకుంది.
https://www.instagram.com/tv/CWhvBL3jJd3/?utm_source=ig_web_copy_link