పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. రవికిషోర్ దర్శకత్వం వహించారు. ఆర్పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మించారు. ఈ నెల 4న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ట్రైలర్‌ను తెరకెక్కించారని, ఆద్యంతం ఉత్కంఠను పంచిందని రానా చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇప్పటివరకు రాని ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, నాజర్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, రచన-దర్శకత్వం: చందిన రవికిషోర్.