Rana Daggubati | సీఐడీ కార్యాలయంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కేసులో సీఐడీ సిట్ అధికారులు శనివారం ఆయనను దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడారు. అనుమతి ఉన్న యాప్ అని తెలిశాకే తాను ప్రచారం చేసినట్లు తెలిపారు. యాప్ గురించి తన న్యాయబృందం విచారణ చేశానన్నారు. వివరాలన్నీ సీఐడీ అధికారులు వివరించినట్లు చెప్పారు. తాను కేవలం స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని చప్పారు. 2017లో బెట్టింగ్, గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయగా.. ఈ విషయంలో తన లీగల్ టీమ్‌తో అన్ని పరిశీలించాకే ఒప్పందం జరిగిందని గతంలోనూ రానా వెల్లడించాడు.
నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతో ఒప్పందం చేసుకోలేదని ఆ సమయంలో వెల్లడించారు. అదే సమయంలో యాంకర్ విష్ణుప్రియను సైతం అధికారులు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విష్ణుప్రియ మూడు యాప్‌లను ప్రమోట్ చేసినట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. తన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు, బ్యాంక్ స్టేట్మెంట్స్ను సైతం సిట్ అధికారులకు అందించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ సైతం విచారణకు హాజరైన విషయం తెలిసిందే.