తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. సందీప్ ఆగరం, అష్మితా రెడ్డి నిర్మాతలు. శ్రావ్య కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి రానా క్లాప్‌నివ్వగా, సందీప్ ఆగరం కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కామెడీ డ్రామాగా తెరకెక్కించబోతున్నాం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది’ అన్నారు. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఎస్.కోట, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాతలు తెలిపారు. రోహన్ రాయ్, నరేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.సోమశేఖర్, సంగీతం: కల్యాణ్ నాయక్, రచన-దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్.