Ram Gopal Varma : సినిమా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే వివాదం అక్కడే ఉంటుంది. ఆయన మాటలు, చేతలు అన్నీ వివాదాస్పదమే అవుతుంటాయి. ఆ వివాదాలతోనే ఆయన తన పబ్లిసిటీని పెంచుకుంటూ ఉంటారు. కాంట్రవర్సీలు, సంచలనాలపైనే ఆయన సినిమాలు ఉంటాయి. ఈ విషయంలో ఏ స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వర్మ వినే రకం కాదు. తాజాగా మహిళలు, శృంగారం విషయంలో వారి మనస్తత్వంపై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు.
టాపిక్ ఎలాంటిదయినా సరే కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం వర్మ స్టైల్. అందుకే కొందరు ఆర్జీవీని పిచ్చోడంటే, ఆయన అభిమానులు మాత్రం భారతదేశంలో స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవిస్తున్న ఏకైక వ్యక్తి అని పొగుడుతారు. ఎంత మంది ఎన్ని రకాలుగా శాపనార్థాలు, చీవాట్లు పెట్టినా వర్మ పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా సమాజం అంతా మాట్లాడటానికి భయపడే సెక్స్, బోల్డ్, వల్గారిటీ లాంటి విషయాల్లో ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు.
కొద్దిరోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, వర్జినిటీ లాంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన వర్జినిటీని కోల్పోయానని వ్యాఖ్యానించారు. బెడ్‌పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా కష్టమని వర్మ అన్నారు. ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు తనతో చెప్పలేదని ఆర్జీవీ బోల్డ్ కామెంట్ చేశారు. డేట్‌కు వెళ్లడం తనకు నచ్చదని, ఏదైనా ఇంట్లోనే అని చెప్పాడు.
‘మీరు అమ్మాయిలనేనా లేదంటే ఆంటీలను కూడా ఇష్టపడుతారా..?’ అని యాంకర్ అడగ్గా ఇద్దరిని అని వర్మ చెప్పిన సమాధానం వైరల్ అయ్యింది. ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందన్నారు. అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారని, అదే సూత్రం బెడ్రూమ్కు కూడా వర్తిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. తాజాగా మరో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఇదే రకమైన బోల్డ్ వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చూడటంవల్ల, లేదంటే ఎవరైనా చెప్పడంవల్ల మహిళల గురించి కొన్ని అపోహలు ఏర్పడతాయన్నారు.
పురుషుడు శృంగారానికి ముందు మహిళతో ఎక్కువగా మాట్లాడుతాడని, స్త్రీలు మాత్రం శృంగార కార్యం ముగిసిన తర్వాత మాట్లాడతారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. శృంగారానికి ముందు అమ్మాయిని కన్విన్స్ చేయడానికే మగాడు ప్రయత్నిస్తాడని ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ మహిళ మాత్రం శృంగారం తర్వాత అతనితో ఎమోషనల్‌గా కనెక్టయ్యి మాట్లాడుతుందని చెప్పారు. పురుషుడు ఎప్పుడైతే తన శారీరక వాంఛ తీరిందో ఇక ఆమెతో సంబంధం లేదన్నట్లుగా పక్కకి తిరిగి పడుకుంటాడని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.