Ramcharan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ramcharan) కొన్ని రోజులుగా యూఎస్‌లో చక్కర్లు కొడుతున్నాడని తెలిసిందే. రాంచరణ్ యూఎస్ ట్రిప్‌లో అమెరికా పాపులర్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో సందడి చేశాడు. ఏబీసీ న్యూస్ లైవ్ ఇంటర్వ్యూ సెషన్లో పాల్గొన్నాడు. వీటితోపాటు హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్ లో కూడా పాల్గొన్నాడు రాంచరణ్. అయితే ఈ స్టార్ హీరో యూఎస్‌లో ఓ వెడ్డింగ్ ఈవెంట్‌కు కూడా హాజరయ్యాడు.
ఇంకో ఆసక్తికర విషయమేంటంటే రాంచరణ్‌తోపాటు మరో యాక్టర్ కూడా ఈ వెడ్డింగ్ ఈవెంట్లో మెరిశాడు. ఇంతకీ అతనెవరో కాదు. విక్టరీ వెంకటేశ్ (Venkatesh). వెడ్డింగ్ ఈవెంట్లో వెంకటేశ్, రాంచరణ్ సందడి చేసిన స్టిల్స్, వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు యాక్టర్లు ఎవరి వెడ్డింగ్‌కు హాజరయ్యారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ జరుగనుంది. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి ఈవెంట్లో పాల్గొనబోతున్నాడు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భారత్‌కు తిరిగి రానున్నాడు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా యూఎస్‌కు వెళ్లనున్నాడని ఇన్సైడ్ టాక్. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఆర్సీ 15లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రాంచరణ్ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వెంకటేశ్ హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీలో నటిస్తున్నాడు. సైంధవ్ దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్న సైంధవ్ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
• @AlwaysRamCharan @VenkyMama ❤️😂#NaatuNaatu pic.twitter.com/SECEA7soYy
— Trends RamCharan (@TweetRamCharan) February 27, 2023
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Samajavaragamana | సామజవరగమన అంటోన్న శ్రీవిష్ణు.. నయా అప్డేట్
Rashmika Mandanna | బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా రష్మిక మందన్నా.. ట్రెండింగ్‌లో ఫొటోలు, వీడియో
Chiranjeevi | కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ