RC 17 | రాంచరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సుకుమార్ ‘ఆర్సీ 17’ లాంచింగ్ టైం ఫిక్స్..!
RC 17 | రాంచరణ్ (Ramcharan), సుకుమార్ (Sukumar) క్రేజీ కాంబోలో మరోసారి ఆర్సీ 17(RC17) సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
RC 17 | ఈ ఏడాది పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ramcharan). ఈ గ్లోబల్ స్టార్ సుకుమార్ (Sukumar)తో చేసిన రంగస్థలం బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని తెలిసిందే. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో మరోసారి ఆర్సీ 17(RC17) సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా టాక్ ప్రకారం ఆర్సీ17 మూవీ ఫైనల్ స్క్రిఫ్ట్ పూర్తయింది. మేకర్స్ త్వరలోనే గ్రాండ్‌గా ఈ సినిమాను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే వచ్చే సెప్టెంబర్‌లోనే సినిమా లాంచ్ కానుందట. అంతేకాదు నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని ఇన్సైడ్ టాక్. రంగస్థలం తర్వాత సుకుమార్-రాంచరణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని వార్తలు రాగా.. మరోవైపు ధురంధర్ శశ్వత్ సచ్దేవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రాంచరణ్ నిర్మాతగా నిఖిల్ హీరోగా నటిస్తోన్న ఇండియా హౌస్ చిత్రానికి కూడా శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందిస్తున్నాడు. మరి దీనిపై రాంచరణ్-సుకుమార్ టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

