ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’లో నటిస్తున్నారు రామ్‌చరణ్. షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా అనంతరం ఆయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తన పాత్ర గత చిత్రాలకంటే పూర్తి వైవిధ్యంగా ఉంటుందని, సవాలుతో కూడుకున్న రోల్ ఇదని ఓ సందర్భంలో చెప్పారు రామ్‌చరణ్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారట.
క్రీడా నేపథ్య చిత్రం కాబట్టి శారీరక ధారుడ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ సినిమాలో ఆయన పలికే యాస కూడా సరికొత్తగా ఉంటుందట. ఇలా అనేక ప్రత్యేకతలతో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్నితీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్నాయి. సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి రానుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.