Neha Sharma | చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది నేహా శర్మ (Neha Sharma). ఈ సినిమా తర్వాత నేహా శర్మ పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాయి. అయితే నేహా శర్మ సినిమాలతో బ్రేక్ అందుకోలేకపోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ అందరిలో జోష్ నింపుతోంది. నేహా శర్మ పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి.
కాగా ఈ భామకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ ఇక డైరెక్టర్‌గా తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్గన్ నిర్మించనున్న పీరియాడిక్ క్రియేచర్ డ్రామాకు నేహాశర్మ దర్శకత్వం వహించనుందన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఓ లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం భాగస్వామ్యంతో 1945 బ్యాక్ డ్రాప్లో సాగే కథ నేపథ్యంలో రాబోయే సినిమాను నేహాశర్మ డైరెక్ట్ చేయనుందంటూ బీటౌన్‌లో కథనాలు రౌండప్ చేస్తున్నాయి.
మరి అజయ్ దేవ్గన్ టీం ఎలాంటి కథను రెడీ చేసిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉండగా.. గ్లామర్ డాళ్ నేహా శర్మ దర్శకత్వం వహిస్తుందన్న వార్తలతో సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోతుంది. సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ రైనా లీడ్ రోల్స్‌లో నటించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానున్నట్టు సమాచారం. మేకర్స్ ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక హీరోయిన్గా సరైన బ్రేక్ అందుకోలేకపోయిన నేహాశర్మ దర్శకురాలిగా మంచి సక్సెస్ అందుకోవాలని అందరూ విష్ చేస్తున్నారు.
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Naga Chaitanya-Sobitha | తిరుమలలో శోభిత చేయి విడవని నాగ చైతన్య.. ఫొటోల కోసం ఎగబడ్డ భక్తులు
Dragon | తారక్ డ్రాగన్ కోసం స్పెషల్ హౌస్ సెట్.. ప్రశాంత్ నీల్ అదిరిపోయే ప్లాన్..!
SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రయోగం.. జంగిల్ సఫారీ రైడ్ అందుకేనా..?