Ramcharan-goutham tinnanuri movie | మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ట్రిపుల్ ఆర్ తో పాటు స్వియ నిర్మాణంలో తెరకెక్కిన ఆచార్య విడుదలకు సిద్దంగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరక్కిస్తున్న #RC15 షూటింగ్ దశలో ఉంది. కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.వీటితో పాటుగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో #RC16 ను చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ట్రైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో రామ్చరణ్ వ్యూచర్కు ట్రావెల్ చేస్తాడని..అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందనే వ్యూచర్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. దీనిపై నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే టైం ట్రావెల్ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య369, సూర్య 24 సినిమాలు రాగా ఇవి రెండు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. #RC16 చిత్రంలో దిశాపటాని ని హీరోయిన్గా ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. యూవీక్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ ను ప్రారంభించే పనిలో ఉన్నారట చిత్ర బృందం.