The GOAT | స్టార్ హీరోలతో పోటీ పడి నటించి తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది సీనియర్ నటి రంభ (Rambha). ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. రంభ వెండితెరపై కనిపించక దశాబ్దమున్నరకుపైగానే అవుతుంది. చాలా కాలం తర్వాత రంభ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ భామ తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి సెల్ఫీ దిగింది. ఇటీవల విజయ్‌తో రంభ కుటుంబసభ్యులు దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంతకీ రంభ విజయ్ను కలవడం వెనుక స్పెషల్ ఏమైనా ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు, అభిమానులు, ఫాలోవర్లు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో The GOAT సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు విజయ్.
2008లో తెలుగులో చివరి సినిమా చేసిన రంభ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. శ్రీలంకన్ తమిళ్ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకున్న రంభ టొరంటోలో స్థిరపడింది.
EXCLUSIVE: Latest clicks of our Thalapathy VIJAY with Actress #Rambha 📸 #TheGreatestOfAllTime #Thalapathy69 @actorvijay pic.twitter.com/6mj1rdRWiz
— Actor Vijay Team (@ActorVijayTeam) July 17, 2024
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?