Ramayana |బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకుల్లో ఒకరైన నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్-ఇండియా మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ .తొలి భాగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతుంది. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనుండగా, కన్నడ రాక్‌స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో నటించనుందన్న వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా యూనిట్ కేక్ కట్ చేస్తూ జరుపుకున్న సంబరాలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి.
ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ పూర్తయినందున, సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను జూలై 3, 2025న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు టీమ్ మొత్తం హాజరుకానున్నారు. బెంగళూర్‌లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం తారలంతా అక్కడికి బయల్దేరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనుండగా, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమాన్‌గా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్ కనిపించి అలరించనున్నారు.
ఇక యష్ ఈ చిత్రంలో నటించడమే కాకుండా, తన ‘Monster Mind Creations’ బ్యానర్‌తో పాటు Prime Focus Studiosతో కలిసి సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో విడుదల కానుంది. భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. రామాయణం రూపంలో భారతీయ సినీ చరిత్రలో మరో విజువల్ వండర్ రాబోతుందన్న ఊహలు జోరుగా వినిపిస్తున్నాయి.
Ram and Lakshman during Ramayana wrap up #Ramayana #RanbirKapoor pic.twitter.com/ViXwAKlvqv
— RK (@Varun_RK88) July 1, 2025