Ramayan | రామానంద్ సాగర్ ‘రామాయణం’ అరుదైన ఘనత.. ఈ ఎపిసోడ్‌కు రికార్డుస్థాయి వ్యూస్..!
Ramayan | భారతీయ పౌరాణిక కథ రామాయణం. హిందువులు ఇష్టపడే, గౌరవించే పురాతన పౌరాణిక కథ. ‘రామాయణం’ పేరు వినగానే అందరికీ రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీనియర్ అందరికీ కళ్ల ఎదుట నిలుస్తుంది. 1980 నాటి ఈ సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది. సీరియల్ వచ్చే సమయంలో రోడ్లపై నిశ్శబ్దం అలుముకునేది. దాదాపు ప్రతి ఇంట్లో సీరియల్లోని పాత్రలపై చర్చలు జరిగేవంటే ఎంత ప్రజాధరణ పొందిందో తెలుస్తుంది.
Ramayan | భారతీయ పౌరాణిక కథ రామాయణం. హిందువులు ఇష్టపడే, గౌరవించే పురాతన పౌరాణిక కథ. ‘రామాయణం’ పేరు వినగానే అందరికీ రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీనియర్ అందరికీ కళ్ల ఎదుట నిలుస్తుంది. 1980 నాటి ఈ సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది. సీరియల్ వచ్చే సమయంలో రోడ్లపై నిశ్శబ్దం అలుముకునేది. దాదాపు ప్రతి ఇంట్లో సీరియల్లోని పాత్రలపై చర్చలు జరిగేవంటే ఎంత ప్రజాధరణ పొందిందో తెలుస్తుంది. ఇటీవల కరోనా మహమ్మారి సమయంలో మళ్లీ ఈ సీరియల్‌ను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. సీరియల్స్ ఎపిసోడ్లు రికార్డ్‌స్థాయిలో టీఆర్పీని సాధించింది. తాజాగా ఈ సీరియల్లోని ఓ ఎపిసోడ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఆ రికార్డు ఏంటో ఓ సారి తెలుసుకుందా రండి..!
సీరియల్లో లక్ష్మణుడిగా పాత్రలో నటించిన సునీల్ లాహిరి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ మూడు సంవత్సరాల కిందట అంటే ఏప్రిల్ 16, 2020న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్లో రాముడి సోదరుడు లక్ష్మణుడు, రావణుడి తనయుడు మేఘనాథుడికి మధ్య జరిగే యుద్ధం ఎపిసోడ్ ప్రసారం కాగా.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దాదాపు 77.7 మిలియన్ల మంద్రి ప్రేక్షకులు వీక్షించారు. ఇదో ప్రపంచ రికార్డు. ఈ సందర్భంగా సునీల్ లాహిరి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను రిలీజ్ చేశారు.
‘సరిగ్గా ఈ రోజు అంటే.. ఏప్రిల్ 16, 2020 రోజు రామాయంలోని లక్ష్మణుడు, మేఘనాథుడి మధ్య జరిగిన యుద్ధం ఎపిసోడ్ యుద్ధం ఎపిసోడ్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఇది చారిత్రాత్మకమైన మైలురాయి. 7.7కోట్ల మంది ప్రేక్షులకు ధన్యవాదాలు. మీ వల్లే ఈ ఘనత సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. లక్ష్మణ్నుడి పాత్రలో సునీల్ లాహిరి, మరో వైపు మేఘనాథుడి పాత్రలో విజయ్ అరోరా తమ తమ పాత్రల్లో జీవించారు. 1980ల్లో ప్రసారమైన ఈ రామానంద్ సాగర్ ‘రామాయణం’ నేటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నది. ఈ దృశ్యకావ్యంలో పాత్రలు పోషించిన నటీనటులందరికీ చిరస్థాయిగా గుర్తింపొందారు. ఈ సీరియల్లో అరుణ్ గోవిల్ రాముడిగా, సీతగా దీపికా చిఖ్లియా, రావణుడిగా అరవింద్ త్రివేది, హనుమంతుడిగా ధారాసింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

