సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటించిన చిత్రం ‘రమణీ కల్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకుడు. ‘కోర్ట్’ ఫేమ్ దర్శకుడు రామ్ జగదీష్ సంభాషణలందించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాటల రచయిత రామ్‌జగదీష్ మాట్లాడుతూ ‘దర్శకుడు ఈ ఐడియా చెప్పినప్పుడు మేమంతా షాక్అయ్యాం.
కళ్లులేని అమ్మాయి, నడవలేని అబ్బాయి.. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఈ కథను స్క్రీన్ మీదకు తీసుకురావడం సవాలుగా అనిపించింది’ అన్నారు. ఈ కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తాయని దర్శకుడు తెలిపారు. కైట్స్ క్రియేటివ్ పతాకంపై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల ఈ చిత్రాన్ని నిర్మించారు.