Miss శెట్టి మిస్టర్ Polishetty | టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబోలో వస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనుష్క చాలా కాలం తర్వాత ఫన్ రైడ్‌తో సాగే సినిమా చేస్తున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. జాతిరత్నాలు సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేసిన నవీన్ పొలిశెట్టి ఇందులో స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నాడు. నవీన్ పొలిశెట్టి ఇంతకీ చీఫ్ చెఫ్‌గా పనిచేస్తున్న అనుష్కను ప్రేమలో పడేశాడా..? లేదా..? అన్నది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన టీజర్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
తాజాగా ఈ టీజర్‌కు ఇంప్రెస్ అయిన రాంచరణ్ రివ్యూ ఇచ్చాడు. సినిమా టీజర్ చాలా బాగుంది. చాలా రీఫ్రెషింగ్‌గా ఉంది. టీం మెంబర్స్ కు గుడ్ లక్.. అని ట్వీట్ చేశారు. రాంచరణ్ ట్వీట్‌తో సినిమాపై బజ్ మరింత పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నోనోనో (NoNoNo Lyrical Song) లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. అనుష్క తల్లి పాత్రలో జయసుధ నటిస్తోంది. సోలో లైఫ్ లీడ్ చేసే నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి ఒక్కటయ్యారా..? లేదా..? అనేది సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. ఈ ఇద్దరి మధ్య ఫన్ ట్రాక్ ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ లో పెట్టేశాడు డైరెక్టర్.
Loved the #MissShettyMrPolishetty teaser, looks refreshing 😃 Good luck to the entire team. https://t.co/3MGYB8920T@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @UV_Creations
— Ram Charan (@AlwaysRamCharan) May 4, 2023
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
నోనోనో లిరికల్ సాంగ్..