మంగళవారం 26 మే 2020
Cinema - May 12, 2020 , 17:29:33

అభిమానుల‌కి రామ్ రిక్వెస్ట్‌..!

అభిమానుల‌కి రామ్ రిక్వెస్ట్‌..!

ఇస్మార్ట్ శంక‌ర్‌తో దుమ్మురేపిన రామ్ ప్ర‌స్తుతం రెడ్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లాక్‌డౌన్ వ‌ల‌న వాయిదా ప‌డింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 15న రామ్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కి సందేశాన్ని అందించారు.

ప్ర‌స్తుతం విప‌త్కర ప‌రిస్థితుల దృష్ట్యా అభిమానులు అంద‌రు నా పుట్టిన రోజు వేడుక‌ల‌కి దూరంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మీ  ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని వెల్లడించారు. ఇప్పుడు సామాజిక దూర‌మే అందరికి శ్రేయ‌స్క‌రం.ఈ ఒక్క‌సారి మీరు పాటించే దూర‌మే నాకు మీరిచ్చే విలువైన కానుక అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెడ్ చిత్రంలో రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  


logo