రామ్ పోతినేని నటిస్తున్న మాస్ ఎంటైర్టెనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్‌బాబు పి. దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్‌స్టార్ సూర్యకుమార్‌గా కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నది.
రామ్, ఉపేంద్ర పాల్గొనగా ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీ పార్ట్‌ని దర్శకుడు మహేష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా ఇది నిలుస్తుందని, ఇప్పటివరకూ చేయని ఒక యూనిక్ క్యారెక్టర్ని రామ్ ఇందులో చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.