మాస్‌ని మెప్పించే ప్రతిభ పుష్కలంగా ఉన్న హీరో రామ్ పోతినేని. ఆయన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగానే ఉంటాయి. ప్రస్తుతం ఆయన సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైవిధ్యమైన దర్శకుడితో ఆయన చేతులు కలిపినట్టు ఫిల్మ్‌వర్గాల టాక్.
ఆ దర్శకుడెవరో కాదు, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో డీసెంట్ హిట్‌ను అందుకున్న మహేశ్‌బాబు. ఆయన దర్శకత్వంలో త్వరలో రామ్ నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. మైత్రీమూవీమేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నదని వినికిడి.