Andhra King Taluka | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు తాజాగా సినిమా విడుదల తేదీని ఒక రోజు ముందుకు జరిపేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
నిర్మాతలు మొదట ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక రోజు ముందుగానే (నవంబర్ 27న) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రామ్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘చిన్ని గుండెలో’ అనే మెలోడీని మేకర్స్ విడుదల చేయగా.. ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పి. మహేశ్‌బాబు (‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.