రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ జరుగుతున్నది. ఇది నెలరోజుల పాటు కొనసాగనుంది. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని, ఈ నెల 18 నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెడతామని, ఈ సినిమాలో చిత్ర కథానాయకుడు రామ్…ఆంధ్ర కింగ్ అని పిలుచుకునే ఓ హీరో అభిమానిగా కనిపిస్తాడని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా సోమవారం విడుదల చేసిన కొత్త పోస్టర్లో హీరో రామ్ ైస్టెలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. సినిమా అభిమాని కథగా ఈ చిత్రం యాక్షన్, కామెడీ అంశాలతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. భాగ్యశ్రీబోర్సే, రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్-మెర్విన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.