Andhra King Taluka | ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వంలో ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. RAPO22గా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. ఉపేంద్ర ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రామ్ టాప్ హీరో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించనున్నాడు.
అందరు స్లార్ల అభిమానులు ఒక్కచోట.. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒక సినిమాలో చూసుకున్నారా..? ఈ ఏడాది బిగ్ స్క్రీన్‌పై మీ లైఫ్‌ను చూసి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న గ్రాండ్‌గా విడుదలవుతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. ఇక రామ్ సోలోగా వస్తుండటంతో సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
గ్లింప్స్‌లో సినిమా రిలీజ్ రోజు తన అభిమాన హీరో స్టైల్‌ను అనుకరిస్తూ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ‘ఆంధ్రాకింగ్ ఫ్యాన్స్ తాలూకా..’ అంటూ యాభై టిక్కెట్లు అడగగానే.. మేనేజర్ టిక్కెట్లు ఇస్తాడు. దాంతో రామ్ ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు చేసుకుంటాడు. అభిమాని పాత్రలో రామ్ నయా అవతార్‌లో కనిపించబోతున్నట్టు విజువల్స్ క్లారిటీ ఇచ్చేశాయి. ఈ మూవీలో రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైవత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
All the STARS’ Fans assemble! 💥💥
Have you ever watched yourself in a movie?
Get ready to relive your life on the Big screen this year! #AndhraKingTaluka GRAND RELEASE WORLDWIDE ON 28th NOVEMBER ❤🔥Energetic Star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh… pic.twitter.com/IOM7kGlntS
— BA Raju’s Team (@baraju_SuperHit) August 21, 2025
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Naga Chaitanya-Sobitha | తిరుమలలో శోభిత చేయి విడవని నాగ చైతన్య.. ఫొటోల కోసం ఎగబడ్డ భక్తులు
Dragon | తారక్ డ్రాగన్ కోసం స్పెషల్ హౌస్ సెట్.. ప్రశాంత్ నీల్ అదిరిపోయే ప్లాన్..!
SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రయోగం.. జంగిల్ సఫారీ రైడ్ అందుకేనా..?