హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ కొవిడ్-19కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ, అక్కడ అని కాకుండా సర్వం ప్రపంచం మొత్తం వ్యాపించి మానవ జీవనాన్నే సవాల్ చేస్తున్న మహమ్మారికి కృతజ్ఞతలు తెలపడమా అని అనుకుంటున్నారా? ట్విట్టర్ ద్వారా రాం గోపాల్ వర్మ స్పందిస్తూ కొవిడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోమారు నిరూపించాయన్నారు. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని వృథా చేసుకోవద్దన్నారు. మనం కోరుకున్న విధంగా జీవితాన్ని జీవించాలని ఆయన పేర్కొన్నారు.
Thanks to Covid, now that we saw how quickly people forget the dead , let’s not waste our life in impressing other people and just live it the way we want to
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2021