ది వారియర్ తర్వాత టాలీవుడ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న ప్రాజెక్టు RAPO 20.
బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చేశాడు రామ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు షురూ అయింది. షూటింగ్ మొదలైందని ట్వీట్ తో కొత్త అప్డేట్ ఇచ్చాడు.
ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పాపులర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నారు. కాగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది బోయపాటి టీం. ఇప్పటికే బోయపాటి సినిమాలకు పనిచేసిన ఎస్ థమన్ మరోసారి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు.
శ్రీలీల మరోవైపు రవితేజ హీరోగా త్రినాథ రావునక్కిన దర్శకత్వం వహిస్తున్న ధమాకాలో హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
And it begins! #BOYAPATIRAPO pic.twitter.com/PpfyE3A1ly
— RAm POthineni (@ramsayz) October 6, 2022
Read Also : Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
Read Also :Salman Khan | మై డియర్ చిరు..సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
Read Also : Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్