Double iSmart | టాలీవుడ్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా మాస్ మ్యూజిక్ జాతర అంటూ పూరీ టీం ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా.. నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ ప్రోమోను లాంచ్ చేశారు. ఇస్మార్ట్ శంకర్‌లో ఫేమస్ అయిన మార్ ముంతా చోడ్ చింతా డైలాగ్‌నే సాంగ్‌గా పెట్టి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పూరీ. రామ్, కావ్య థాపర్ అండ్ టీంపై పార్టీ మూడ్‌లో సాగుతున్న ఈ మాస్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని ప్రోమో చెబుతోంది.
మార్ ముంతా చోడ్ చింతా ప్రోమో..
ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ సాగుతున్న టీజర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌కు స్పీకర్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ రెడీ చేసినట్టు తాజా సాంగ్ చెప్పకనే చెబుతోంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
A warm-up for the #DoubleIsmart Desi Party 🍻#MaarMunthaChodChinta Promo Out Now🎶🔥
Full Lyrical Video TOMORROW at 4 PM ❤️🔥
A #ManiSharma Mass Musical💥#DoubleIsmartOnAug15
Ustaad @ramsayz @KavyaThapar #PuriJagannadh @Charmmeofficial @duttsanjay pic.twitter.com/Lcu36MyOhP
— Puri Connects (@PuriConnects) July 15, 2024
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Suriya | సూర్య కంగువ మ్యూజికల్ ప్రమోషన్స్ టైం.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?