Peddi Day1 | బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ.. తొలిరోజే రూ. 135 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్!
RamCharan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది.
RamCharan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన ఓపెనింగ్స్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇండియాలో గురువారం నాడు సుమారు రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా, బుధవారం నాటి పెయిడ్ ప్రివ్యూల ద్వారా మరో రూ. 18.50 కోట్లు రాబట్టింది. దీనితో మొత్తంగా ఇండియా నెట్ కలెక్షన్ రూ. 69.50 కోట్లకు చేరింది. ఇక ఇండియా గ్రాస్ కలెక్షన్ దాదాపు రూ. 82.49 కోట్లుగా నమోదు కాగా, ఓవర్సీస్ గ్రాస్ సుమారు రూ. 30 కోట్లుగా ఉంది. మరోవైపు వర్కింగ్ డే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని థియేటర్లలో దాదాపు 68 శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు, దివ్యేందు ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రామ్ చరణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటంతో, వీకెండ్ ముగిసే సరికి ఈ కలెక్షన్ల జోరు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

