Ram Charan 16 Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Mega Power Star) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్(Jahnvi Kapoor) కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ(Divyendu Sharma) ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీరామి నవమి కానుకగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ కూడా విడుదల చేయబోతుంది చిత్రయూనిట్.
ఈ క్రమంలోనే ఈ మూవీ ఆడియో రైట్స్‌కి సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ ప్రముఖ బ్యానర్ ‘టీ సిరీస్’ ఈ చిత్ర ఆడియో రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ ఏకంగా రూ.35 కోట్లు వెచ్చించి స్వంతం చేసుకుందని తెలుస్తోంది. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.