Klin Kaara | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతుల గారలపట్టి క్లీంకార గుడికి వెళ్లింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ముత్తాత (ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి), తాతయ్య (ఉపాసన తండ్రి అనిల్ కామినేని)తో కలిసి క్లీంకార అపోలో ఆస్పత్రిలోని ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గోంది. క్లీంకారను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ ఆలయంకు నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓం నమో వేంకటేశాయ అంటూ రాసుకోచ్చింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. అయితే క్లీంకార ఫొటోను బ్లర్ చేసి అప్లోడ్ చేసింది ఉపాసన.
Klin Kaara is truly blessed to join her
Great Grandparents at the Sri Venkateswara Swamy Vari Pavithrotsavamulu at @HospitalsApollo temple today. Seeing her in her Thatha’s arms reminds me of my childhood 🥰
This temple holds a very special place in my heart, and this moment =… pic.twitter.com/WM2qpzsYSU— Upasana Konidela (@upasanakonidela) December 12, 2024