Ram Charan | చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బడా విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు. ఇందుకు కారణం ఇటీవల పెద్ది గ్లింప్స్ రిలీజ్ కాగా, ఈ టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. గ్లింప్స్ లో ప్రతి షాట్ కూడా అభిమానుల మనసులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ కావడం ఖాయం అని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 9న లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని లాంఛ్ చేయనున్నారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. రామ్ చరణ్‌కి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్‌తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలు, ఫోటోలు, వీడియోలు తీసుకుని ఈ మైనపు బొమ్మను శరవేగంగా తయారు చేశారు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలను టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరుతుండడం అందరిని ఆనందింపజేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.