Ram Charan | దాదాపు నెల రోజుల విరామం తర్వాత అగ్ర హీరో రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన శైలి సామాజిక సందేశాన్ని కలబోసి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇందులో కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ అన్బు అరివు నేతృత్వంలో భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించబోతున్నారని, సినిమాకు ఇవి హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.
దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో పోరాట ఘట్టాలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.