ప్రార్థనతోనే తమ రోజువారీ జీవితం ప్రారంభమవుతుందని వెల్లడించారు హీరో రామ్ చరణ్. తాము పర్యటనల నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్లినా వెంట దేవుళ్ల ఫొటోలను, పూజా సామాగ్రిని తప్పకుండా తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన తమ దినచర్యను అక్కడి మీడియాతో పంచుకున్నారు. లాస్ ఏంజెలీస్లోని తమ నివాసం వద్ద రామ్చరణ్ మాట్లాడుతూ…‘ప్రతి రోజూ దైవారాధనతోనే మొదలవుతుంది. మేము ఎక్కడికి వెళ్లినా అక్కడ ఓ పూజగది ఏర్పాటు చేసుకుంటాం. ప్రార్థనతో మా మనసుల్లో ప్రశాంతత నిండుకుంటుంది. అది మా ఆచారం కూడా. ఈ పూజలు మాకు ఇంత గుర్తింపు, ఆదరణ దక్కేలా చేసిన దేవుడికి కృతజ్ఞత అనుకుంటాం’ అని చెప్పారు.