తన కెరీర్లో ఎక్కువ శ్రమించి చేసిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అని, చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడ్డానని తెలిపారు స్టార్ హీరో రామ్చరణ్. 35 రోజుల పాటు సా గిన ఈ సినిమా చిత్రీకరణ తనను చెమటోడ్చేలా చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తా జాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు రామ్ చరణ్. ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశంలో రామ్చరణ్ మాట్లాడుతూ…“ఆర్ఆర్ఆర్’ సినిమా మా అందరి కెరీర్లో ఒక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది.
జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. కష్టేఫలి అన్నట్లు ఈ సినిమా కోసం మేము విపరీతంగా కష్టపడ్డాం. నా ఇంట్రడక్షన్ సీన్ కోసం జరిపిన షూటింగ్ కోసం నా కెరీర్లో ఎప్పుడూ లేనంత ఇబ్బంది పడ్డాను. మొత్తం 35 రోజులు షూటింగ్ కోసం శ్రమించాల్సి వచ్చింది. దర్శకుడు రాజమౌళి ప్రతి సన్నివేశంలో తీసుకునే శ్రద్ధ, పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం దీనికో కారణం. ఏమైనా ఒక అరుదైన చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ప్రస్తుతం రామ్చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది కాకు ండా ఆయన ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తున్నది.