Ram Charan |తెలుగు రాష్ట్రాలలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం కన్నుల పండువగా జరిగింది. అన్ని మసీదుల్లో సామూహికంగా నమాజులు జరిగాయి. ఢిల్లీ జామా మసీదు, హైదరాబాద్ మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు చేశారు. ఇక వారి ఇళ్లల్లో కూడా సంబరాలు అంబరాన్నంటాయి. ఆలింగనాలు చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా రంజాన్ పండుగని సంతోషంగా జరుపుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈద్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్లి రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. క్యాజువల్ డ్రెస్ వేసుకొని సింపుల్ లుక్‌లో కనిపించిన రామ్ చరణ్ కి ఆయన స్నేహితులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వారు చరణ్‌ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక రామ్ చరణ్ ముస్లిం వంటకాలని ఇష్టంగా ఆరగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ అభిమానులని నిరాశపరిచింది.
ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేశారు. ఈ పోస్టర్ తర్వాత అభిమానులలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. చిత్రంలో రామ్ చరణ్ రా, రగ్డ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Ram Charan at a private Eid party!
pic.twitter.com/GHqMg0yvT4— Satya (@YoursSatya) March 31, 2025