Ram Charan | సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో రామ్‌చరణ్ పాల్గొన్నాడు. డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్ద వీరుల నివాళుల కార్యక్రమానికి హజరై చరణ్ వీరులకు నివాళులు అర్పించి పుష్పగుచ్ఛం అందించాడు. అనంతరం చరణ్ మాట్లాడుతూ ’75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని, దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాలి అని వెల్లడించాడు. మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దేశ సైనికుల త్యాగాలే కారణం. మనం నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుంది. వీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోవద్దు అంటూ వెల్లడించాడు. అంతేకాకుండా ధృవ సినిమాలో ఆర్మీ అధికారిగా నటించడం గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.
రామ్‌చరణ్ ప్రస్తుతం నటించి నిర్మించిన చిత్రం ఆచార్య. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్వకత్వం వహించాడు. చరణ్ ఈ చిత్రంలో సిద్ద అనే కీలకపాత్రలో నటించాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.