Unpredictable Song | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది శంకర్ టీం.
తాజాగా ఈ మూవీ నుంచి అన్‌ప్రెడిక్టబుల్ సాంగ్ (Unpredictable Song)ను లాంచ్ చేశారు. గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ షేడ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియజేసే థీమ్‌తో కట్ చేసిన సాంగ్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్వితీయ, బ్లేజ్ రాసిన ఈ పాటను ఎస్ థమన్, బ్లేజ్ పాడారు.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
అన్‌ప్రెడిక్టబుల్ సాంగ్..
Game Changer | గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై హైకోర్టులో విచారణ
Shraddha Kapoor | శ్రద్ధాకపూర్ న్యూ హెయిర్ కట్.. కొత్త లుక్ స్పెషలేంటో..?
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి