Game changer | టాలీవుడ్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఆర్సీ 15 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ రేపు షురూ కానుంది. సుమారు 20 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
రాంచరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనుందట. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు రాంచరణ్ ఫాలోవర్లు, అభిమానులు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తయితే ఈ చిత్రాన్ని 2024 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తోంది శంకర్ టీం. ఇప్పటికే విడుదల చేసిన గేమ్ ఛేంజర్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తుండగా.. రాజోలు భామ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.