Ram Charan 16 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్సీ16 వర్కిల్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మూవీ కోసం బరువు పెరుగుతున్న చెర్రి తాజాగా గడ్డం కూడా పెంచుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా రామ్ చరణ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ ఫొటోలో రామ్ చరణ్ గడ్డంతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దర్శకుడు వివి వినాయక్ రీసెంట్గా రామ్ చరణ్‌ను కలిశాడు. అప్పుడే ఈ లుక్ బయటకు వచ్చింది. ఉత్తరాంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఆస్కార్-విజేత A.R. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
#RC16 – Look – Work In Progress!! pic.twitter.com/8iNdd0GsCj
— Aakashavaani (@TheAakashavaani) October 9, 2024