RC15 Movie | కియారా-సిద్ధార్థ్ మల్హోత్రాలకు RC15 టీమ్ స్పెషల్ వీడియో
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ 'RC15'. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుంది. కాగా కియారా తాజాగా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది.
Kiara-sidharth Malhotra | రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘RC15’. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుంది. కాగా కియారా తాజాగా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా RC15 చిత్రబృందం ఈ జోడీకి శుభాకాంక్షలు తెలిపింది. చిత్రయూనిట్ మొత్తం పూలు చల్లుతూ ఓ స్పెషల్ వీడియాను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా తాజాగా ఈ వీడియోపై కియారా స్పందించింది.
ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. ఇలా RC15 టీమ్మొత్తం ఒకదగ్గరే కనిపించే సరికి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలులో జరుగుతుంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటి అంజల్, రామ్ చరణ్ భార్యగా కనిపించనుంది.
Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life!
Wishing you a lifetime of happiness, love and light❤
Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI
— Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

