రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఫస్ట్‌సింగిల్ ‘చికిరి చికిరి’ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట యూట్యూబ్‌లో రెండొందల మిలియన్ వ్యూస్‌ను దక్కించుకొని సరికొత్త రికార్డు సృష్టించిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి రామ్‌చరణ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్లుగానే ‘పెద్ది’ సినిమా మార్చి 27న రావడం ఖాయమని చెప్పారు. ఈ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని, ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపిస్తానని అన్నారు. రామ్‌చరణ్ మాటలతో సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తుండగా..ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.