Andhra King Taluka | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. RAPO22గా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయినట్టు కేక్ కట్ చేసిన ఫొటోలు, వీడియోను షేర్ చేశాడు రామ్. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. స్మైల్స్, మ్యూజిక్, మ్యాజిక్.. అకాడమీ అవార్డ్ విన్నర్, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆంధ్రకింగ్ తాలూకా టీంతో మ్యూజిక్ సెషన్స్‌లో జాయిన్ అయ్యాడు.. అంటూ రామ్ అండ్ టీం చంద్రబోస్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
రామ్ ఈ చిత్రంలో టాప్ హీరో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించనున్నాడు. గ్లింప్స్‌లో సినిమా రిలీజ్ రోజు తన అభిమాన హీరో స్టైల్‌ను అనుకరిస్తూ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ‘ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ తాలూకా..’ అంటూ యాభై టిక్కెట్లు అడగగానే.. మేనేజర్ టిక్కెట్లు ఇస్తాడు. దాంతో రామ్ ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు చేసుకుంటాడు. ఈ మూవీలో అభిమాని పాత్రలో రామ్ నయా అవతార్‌లో కనిపించబోతున్నట్టు విజువల్స్ క్లారిటీ ఇచ్చేశాయి.
ఈ చిత్రంలో రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Smiles. Music. Magic. ❤️
Academy Award-winner @boselyricist garu joins the #AndhraKingTaluka team during their music sessions ✨#AKTonNOV28
Energetic Star @ramsayz @filmymahesh @iamviveksiva @mervinjsolomon @MythriOfficial #RAPO pic.twitter.com/044gRvTHEY
— BA Raju’s Team (@baraju_SuperHit) November 3, 2025
NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!