Ram Pothineni | హీరో రామ్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నది. ఇదిలావుండగా తాజాగా రామ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. దీనిని చందు మొండేటి డైరెక్ట్ చేస్తారని సమాచారం. ఇటీవల ‘తండేల్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు చందూ మొండేటి. ఆయన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో సూర్యతో చేయాల్సి ఉంది. కథా చర్చలు కూడా పూర్తయ్యాయి.
అయితే ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈలోగా రామ్‌తో ఆయన సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. ఇటీవలే రామ్‌ని చందూ మొండేటి కలిసి ఓ కాన్సెప్ట్ చెప్పారని, అది బాగా నచ్చడంతో రామ్ సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా పూర్తయ్యాక చందూ మొండేటి సినిమా పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.