వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ ఢిల్లీ భామ కొంతకాలంగా వరుసగా హిందీ సినిమాలు చేస్తూ..బాలీవుడ్ (Bollywood)పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తెలుగులో సినిమాలు తగ్గించిన రకుల్ ఈ ఏడాది ఎటాక్, రన్ వే 34 సినిమాలతో ఆడియెన్స్ ను పలుకరించింది. ఈ భామ చేతిలో ప్రస్తుతం కొత్తగా 4 హిందీ సినిమాలున్నాయి. ఇవన్నీ దాదాపు ఈ ఏడాదే విడుదలయే ఛాన్స్ ఉన్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఇక తన ఫ్లాప్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది రకుల్.
రన్ వే 34 (Runway 34) బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలవడంపై ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ను అడుగగా..మేమంతా సినిమా బాగా ఆడుతుందని అనుకున్నాం. కానీ దురదృష్ణకరమైన సమయం..ప్రతీ రోజు ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని సమయాల్లో థియేటర్లలో ఏది బాగా వర్కవుట్ అవుతుందో మాకు తెలియదు..అంటూ చెప్పుకొచ్చింది రకుల్. దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏది రూల్ చేస్తుందో చెప్పేందుకు రకుల్ చెప్పిన మాటే ఉదాహరణ అంటున్నారు సినీ జనాలు.
కొన్నిసార్లు థియేటర్లలో ఏ సినిమా బాగా వర్కవుట్ అవుతుందో ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేరనేది ఒప్పుకోవాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 31 October Ladies Night సినిమాలో నటిస్తోంది.
Read Also : Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్‌తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Also : Shahrukh Khan | రామోజీఫిలింసిటీలో షారుక్ ఖాన్..జోష్‌లో అభిమానులు
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్