Rakul Preet Singh | చిత్రసీమలో బంధుప్రీతి వల్ల తానూ ఇబ్బందిపడ్డాననీ, ‘నెపోటిజం’తో మంచి అవకాశాలను కోల్పోయాననీ బాంబ్ పేల్చింది రకుల్‌ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఈ పంజాబీ సోయగం. కెరీర్ మొదట్లో హిట్లు పలకరించినా.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. దాంతో కోలీవుడ్.. అట్నుంచి బాలీవుడ్ బాటపట్టింది. అయితే.. అక్కడా ఆమెకు సరైన హిట్ దక్కలేదు. తాజాగా, నెపోటిజంపై ఆమె చేసిన కామెంట్స్.. పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. “ఇన్నేళ్ల నా సినిమా కెరీర్లో నెపోటిజం కారణంగా ఎన్నో అవకాశాలను వదులుకున్నాను. అయినా ఆ విషయంలో ఏమాత్రం బాధపడలేదు. కొన్ని విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. సినిమా చాన్స్‌లు మిస్సవడం అనేది.. లైఫ్‌లో ఒకపార్ట్ మాత్రమే! దాని గురించే ఆలోచిస్తూ.. నా టైం వేస్ట్ చేసుకోను. ‘నేను ఎలా ఎదగాలి!?’ అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను” అని చెప్పుకొచ్చింది. చివరిగా.. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు వచ్చినన్ని అవకాశాలు మిగతావారికి రావడం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేసింది రకుల్.