టాలీవుడ్లో దుమ్మురేపిన రకుల్‌ప్రీత్ సింగ్ కొన్నాళ్ల కిందటే బాలీవుడ్‌పై కన్నేసింది. హిందీలో అరంగేట్రం తర్వాత తెలుగులో సినిమాల సంఖ్య తగ్గించింది. అయితే బాలీవుడ్లో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోయినా తన పరుగు ఆగదు అంటున్నది ఈ ముద్దుగుమ్మ. ‘ఎక్కడికి వెళ్లినా పోటీ సహజంగా ఉంటుంది. కానీ, నేను కష్టాన్ని నమ్ముకున్నా. పట్టుదలతో పనిచేస్తే అనుకున్నవన్నీ సాధించగలమనే విశ్వాసం నాకుంది’ అంటున్నది రకుల్. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు వచ్చాయనీ, ప్రతీ సందర్భం ఒక విలువైన పాఠాన్ని నేర్పిందని చెబుతున్నది.
‘కొన్ని సందర్భాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ, వాటిని ఎదుర్కొన్నప్పుడే జీవితం మరింత రాటుదేలుతుంది. చేతిలో అవకాశాల్లేక ఇంట్లో కూర్చున్న సందర్భమైతే ఇంతవరకూ రాలేదు. కొవిడ్లోనూ నేను షూటింగ్స్ చేశాను. గతేడాది నా సినిమాలు ఐదు రిలీజ్ అయ్యాయి. నేను బిజీగా ఉన్నానని రుజువు చేయడానికి ఇవన్నీ చెప్పడం లేదు. మన పని మనం చేసుకుంటూ పోతే.. అవకాశాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతా’ అని చెప్పుకొచ్చింది రకుల్.