Rakul Preet Singh | ఒకప్పుడు తెలుగులో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించి అలరించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ వరుస ఫ్లాపులతో డీలా పడింది. టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్, బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. కాని అక్కడ ఆమెకి సరైన సక్సెస్ రాలేదు. ఇక అవకాశాల కోసం ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా రకుల్‌ని పట్టించుకునే వారే కరువయ్యారు.
రకుల్ సినిమాల్లో కనిపించి దాదాపు రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఏ రకంగా ఉందో మనకి అర్ధం అవుతుంది. ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ తను ప్రేమించిన జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. వారి వివాహం గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకతో రకుల్, జాకీ ఒక్కటి కాగా, వారి వివాహం పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో జరగ్గా.. ఆ తర్వాత వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలో అట్టహాసంగా జరిగింది. ఇక రీసెంట్ గా రకుల్, జాకీల జంట.. తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగానే జరుపుకున్నారు.
అయితే జాకీ, రకుల్ జంట.. త్వరలో తల్లిదండ్రులు కానున్నారని బీటౌన్‌లో ఓ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా రకుల్.. టైట్ ఫిట్ అండ్ గ్లామరస్ డ్రస్సుల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఫుల్ కంఫర్ట్ అండ్ ఫ్రీ డ్రెస్సుల్లో కనిపిస్తుండే సరికి గర్భిణీ అవ్వడం వల్ల డ్రెస్సింగ్ సెన్స్ లో ఛేంజ్ తీసుకొచ్చిందని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. దీనికి తోడు జాకీ తమ కిచెన్ లో ఎంతో ప్రేమగా వంట చేస్తూ కనిపించే సరికి.. రకుల్ కోసమే జాకీ ఇంత కష్టపడుతున్నాడు అనుకుంటా అని నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. జాకీ దగ్గరుండి రకుల్‌ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని , త్వరలోనే రకుల్ ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు.